తెలంగాణ

అద్భుతంగా అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చి దిద్దాలని రాష్ట్ర విద్యుత్, ఎస్‌సి అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అని వివరించారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నెక్లెస్ రోడ్ సమీపంలో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం విగ్రహ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైనా, సిక్కిం తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను పరిశీలించింది. అనంతరం పలుసార్లు నిపుణులతో సమావేశమై అంబేద్కర్ విగ్రహాల నమూనాను పరిశీలించారు.
ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన డిజెయిన్ స్టూడియో అసోసియేషన్ ముందుకు వచ్చి కొన్ని నమూనాలను సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం విగ్రహ కమిటీ సమావేశమైంది. డిజెయిన్ సభ్యులు రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. కొన్ని మార్పులు సూచించారు.
తదుపరి సమావేశంలో ఎంత స్థలంలో విగ్రహం నిర్మించాలో నిర్ణయించనున్నారు. సమావేశంలో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, శాసన సభ్యులు గాదరి కిశోర్, వేముల వీరేశం, యస్‌సి అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అజేయ్ మిశ్రా, రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, జెఎన్‌టియు శిల్పి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..శుక్రవారం సచివాలయంలో సమావేశమైన విగ్రహ కమిటీ సభ్యులు