తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తున్నారని అన్నారు. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్టు, దేశంలో ఇలా ఎక్కడా జరగలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటామని, జర్నలిస్టుల యూనియన్‌కు స్థలం కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు వ్యవహరించాలని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే జిల్లాల్లో కూడా వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల ఫండ్ కింద 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు కూడా త్వరలోనే హెల్త్ కార్డులు మంజూరు అవుతాయని, దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అయిందని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టులకు ప్రాధాన్యత పెరిగిందని, వారి సంక్షేమంపై దృష్టిసారించారని క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సమస్యలపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్‌రెడ్డి, వరంగల్ మేయర్ బండ నరేందర్, డిజిపి అనురాగ్ శర్మ, జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి వర్గానికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహించారని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు.