తెలంగాణ

వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను ప్రధాని నరేంద్రమోదీ 42 శాతం పెంచారని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ పెంపు జనవరి 19వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని అయితే ఆ రోజు నుండి కనీస వేతనాల పెంపును సింగరేణి సంస్థలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కూడా అమలుచేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. సింగరేణి కార్మిక సంఘం నాయకులతో కలిసి కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిసినట్టు ఆయన చెప్పారు. నైపుణ్యం ఉన్న వారు, నైపుణ్యం లేని వారికి, పాక్షిక నైపుణ్యం ఉన్న కాంట్రాక్టు కార్మికులకు సైతం ఈ పెంపు వర్తిస్తుందని చెప్పారు. దీనివల్ల 12వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. నైపుణ్యం లేని వారి వేతనం రోజుకు 48 రూపాయిలు పెరిగిందని, దానివల్ల నెలకు 996 రూపాయిల వరకూ వేతనం పెరుగుతుందని, ఎరియర్స్ వల్ల వారు మరో 7వేల రూపాయిలు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. పాక్షిక నైపుణ్యం ఉన్న వారు, నైపుణ్య కార్మికులు సైతం ఈ పెంపు ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. సింగరేణి కార్మికులకు వేతన పెంపు వర్తింపచేయకపోవడంతో సమ్మెకు వెళ్లారని, దానిపై యాజమాన్యం వేతనాల పెంపుపై మార్చి నెలలో హామీ ఇచ్చినా తర్వాత దానిని అమలుచేయలేదని, దాంతో యూనియన్ నాయకులు అంతా రావడంతో చొరవ తీసుకుని దత్తాత్రేయ కేంద్ర ఇంధన మంత్రి పియూష్ గోయల్ వద్దకు వారిని తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. దాంతో సమస్య పరిష్కారమైందని మంత్రి కార్యాలయం పేర్కొంది. కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఆవుల గోవర్ధన్, బిఎంఎస్ అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి పుల్లి రాజారెడ్డి తదితరులు దత్తాత్రేయను, పియూష్ గోయల్‌ను అభినందించారు.
బోనస్ కూడా అమలుచేయాలి
కేంద్రప్రభుత్వం కనీస వేతనం అమలుచేయడంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు బోనస్, ఇఎస్‌ఐ కూడా సింగరేణిలో అమలుచేయాలని బిజెఎల్‌పి నేత జి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో పాటు వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుచేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
19న నిజామాబాద్‌లో జాబ్ మేళా
19న నిజామాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపి కె కవితతో పాటు స్థానిక నేతలు పాల్గొంటారని చెప్పారు.
నేడు ఎస్సీ మోర్చ సమావేశం
బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఆగస్టు 19న యాదగిరి గుట్టలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఎస్సీ మోర్చ అధ్యక్షుడు వేముల అశోక్ అధ్యక్షత వహిస్తారు. మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరై మార్గదర్శనం చేస్తారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పాల్గొంటారు.