తెలంగాణ

డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, ఆగస్టు 18: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం అమీర్‌పేటలోని మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన ‘ది ప్రిన్సిపల్స్ కాన్‌క్లేవ్ -2017’కు ఆయన ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. నగరంలో డ్రగ్స్ రాకెట్ ఈ స్థాయిలో విస్తరించడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. యుక్తవయస్సులో పిల్లలు పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు ఉంటుందని అన్నారు. విద్యాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రధానోపాధ్యాయులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా కొన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు సామాజిక మాద్యమాలు, మీడియాల్లో వార్తలు రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కొంతమంది విద్యార్థులు వాట్సప్ గ్రూప్‌లో చాట్ చేసినట్టు మాత్రమే గుర్తించి సదరు పాఠశాలలకు సమాచారం అందించామని చెప్పారు. విద్యార్థులను సన్మార్గంలో నడిచేలా ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు చేయాలని కోరారు. ప్రస్తుతం నగరంలోని ఏడవ తరగతి విద్యార్థికి సైతం డ్రగ్స్ అంటే తెలిసిపోయిందని అన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏమిటి? వాటి వల్ల జరిగే అనర్థాలు ఏమిటి? అనే విషయాలపై ప్రత్యేక చర్చాగోష్టులు జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ‘ది ప్రిన్సిపల్స్ కాన్‌క్లేవ్ -2017’ సదస్సులో
ప్రసంగిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్