తెలంగాణ

వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 18: తెలంగాణ సర్కార్ వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించడంతో పాటు పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు 40డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మొట్టమొదటి డయాలసిస్ సెంటర్‌ను సిద్దిపేటలోనే ప్రారంభించుకోవడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ మూడేళ్లలోనే ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ బలోపేతం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించిందన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కంకణబద్దులై పనిచేస్తున్నారన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల తీవ్ర వ్యయప్రయాసాలకు గురి అయ్యేవారన్నారు. పేద ప్రజలకు ఆదుకునేందుకే ప్రభుత్వమే సర్కార్ ఆసుపత్రుల్లో ఈ డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ యూజర్ ఫిల్టర్‌లు, పరికరాలు యూనిట్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఫిల్టర్లను 10నుండి 15సార్లు పేషెంట్లకు వినియోగించడం వల్ల రక్తం సరిగా శుభ్రం అయ్యేది కాదన్నారు. తెలంగాణ సర్కార్ పేద ప్రజల కోసం సింగిల్ యూజ్ కిట్లను తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా అమలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే అన్ని డయాలసిస్ సెంటర్లలో ఈ సింగిల్ యూజ్ కిట్లను వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌లకు దీటుగా సేవలందించేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అన్ని రకలా పరికరాలను సైతం ఎక్కడా రాజీపడకుండా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాటిని వినియోగించనున్నట్టు తెలిపారు. ల్యాబ్, ఫర్నిచర్, మందులు అన్ని నాణ్యతతో కూడినవే నన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లేని పరికరాలు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా బస్‌పాసు సౌకర్యం కల్పించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ఏరియా ఆసుపత్రుల్లో సైతం ఐసియు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి మెడికల్ కళాశాలను మహబూబ్‌నగర్‌కిస్తే రెండవ కళాశాలను సిద్దిపేటకు మంజూరు చేశారన్నారు. ఈ వైద్య కళాశాలల ఏర్పాటు వలన ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుతాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు అనవరసమైన శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసే అనవసర శస్త్ర చికిత్సలను అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రులు చేసే శస్త్ర చికిత్సల వివరాలను డిఎంఅండ్‌హెచ్‌ఓ అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే దీర్ఘకాలికమైన వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పేద ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వైద్య శాఖ అధికారులు నర్సింహ్మా, వైస్‌చైర్మన్ అక్తర్ పటేల్, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సిద్దిపేటలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి