తెలంగాణ

స్టార్టప్స్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: హైదరాబాద్ టి-హబ్‌లో స్టార్టప్స్ ఏర్పాటుకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసే), టి.హబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 4న ప్రభుత్వం నూతన ఐటి పాలసీని ప్రకటించిన సందర్భంగా ఐటి రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు తగిన ప్రోత్సాహాన్ని అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు హైసే శుక్రవారం వెల్లడించింది. లాభాపేక్షలేని సంస్థగా ఉన్న హైసే 1991 నుంచి పని చేస్తూ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడుతుందని ఒప్పందంపై సంతకాల అనంతరం హైసే అధ్యక్షుడు రమేష్ లోగనాథన్ తెలిపారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటి క్లస్టరైన టి-హబ్‌లో స్టార్ట్‌ప్‌ల ఏర్పాటుకు తగిన సహాయ సహకారాలు, మార్గదర్శకాలు అందిస్తామని ఆయన తెలిపారు.