తెలంగాణ

ఒకే రోజున లక్ష మంది ప్రాణాయామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్ దేశవ్యాప్తంగా ఒకేసారి సుమారు లక్ష మందితో యోగ, ప్రాణాయామం చేయించి రికార్డు సృష్టించారు. శనివారం టివీ ద్వారా రవి శంకర్ ప్రాణాయామం, యోగ గురించి తెలిపారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు దేశ వ్యాప్తంగా రెండు వేల కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో హైదరాబాద్‌లో, నగర శివారులో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలంగాణ కో-ఆర్డినేటర్ చిత్ర, మీడియా కో-ఆర్డినేటర్ వాణి తెలిపారు.
ఇంకా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఆత్మన్యూనత, తనను తాను తక్కువగా భావించుకోవడం, పరస్పర సంఘర్షణలు, హింసాధోరణుల నుంచి బయటపడే విధానాలను ఈ కార్యక్రమం ద్వారా గురూజీ తెలియజేశారని వారు తెలిపారు.
శరీరంలోని ప్రాణశక్తిని నిలుపుకోవడం, ఆనందంగా ఉండడం, వేగవంతమైన నేటి జీవితంలో సవాళ్ళను ఎదుర్కొవడానికి అవసరమైన ఆచరణాత్మక విధానాలను నేర్పించారని వారు వివరించారు. ఆత్మహత్యలు, కుంగుబాట్లను నివారించేందుకు ఆచరణాత్మకమైన సమాధానాలు తెలియజేశారని వారు చెప్పారు.