తెలంగాణ

బిజెపియే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని, ఈ దిశగా తమ పార్టీ అత్యంగా వేగంగా విస్తరిస్తోందని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతూ అనేక మంది బిజెపిలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 10, 11, 12వ తేదీలలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో అనేక మంది పార్టీలో చేరనున్నారని దత్తాత్రేయ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదంటూ తెరాస ప్రభుత్వం దుష్ప్రచారం సాగిస్తోందని, దీనిని తిప్పికొట్టేందుకు గ్రామగ్రామాన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కేంద్రం ఏయే పథకాల కింద రాష్ట్రానికి ఎంత మొత్తంలో నిధులు కేటాయిస్తుందనే విషయాలకు ప్రజలకు వివరిస్తామని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం రైతాంగానికి వరంలాంటిదని అన్నారు. సంస్థాగతంగా బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు బూత్ లెవల్ నుండి అన్ని స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాలను సైతం గ్రామ స్థాయి వరకు విస్తరిస్తామని, మండల కమిటీల నియామకాలు పూర్తయ్యాయని వివరించారు.
కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట
సంఘటిత, అసంఘటితరంగ కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన సమాన వేతనాల బిల్లు ఆమోదం పొందిన మీదట, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం నిర్ణయించిన మేరకు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమ చొరవతో సింగరేణి కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ