తెలంగాణ

తడిసి ముద్దయన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్/ కరీంనగర్/ నల్లగొండ/ వరంగల్/ ఆదిలాబాద్, ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయ. కరీంనగర్ జిల్లాలో శనివారం ఎడెనిమిది మండలాల్లో భారీ వర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రామగుండం రీజియన్ పరిధిలోని ఒసిపి-1, ఒసిపి-2, ఒసిపి-3, ఒసిపి-4 ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. పూర్వపు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, శంకరపట్నం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కమాన్‌పూర్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, జగిత్యాల, రాయికల్, వెల్గటూర్, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, సారంగపూర్, సిరిసిల్ల, ఏల్లారెడ్డిపేట, ముస్తాబాద్, చందుర్తి, వేములవాడ, కోనరావుపేట తదితర మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అడపాదడపా భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, సిరిసిల్ల, పెద్దపల్లి, రామగుండం తదితర పట్టణాల్లో భారీ వర్షం కురిసింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలు రైతులకు కొంతమేర ఊరటనిస్తున్నాయి.
వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తాజాగా గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊపిరినందించాయి. దాదాపు మూడు వారాల నుండి వర్షాల జాడ లేక ఎండిపోయే దశకు చేరిన పైర్లకు శనివారం నాటి వర్షం జీవం పోసింది. నిన్నమొన్నటి వరకు వేసవి తరహాలో ఎండ వేడిమితో సతమతమైన ఇందూరు జిల్లా తడిసిముద్దయ్యింది. ఏమాత్రం విరామం లేకుండా రోజంతా ఏకబిగిన వర్షం కురియడంతో ఎటుచూసినా పంట పొలాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచి తటాకాలను తలపించాయి.
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం రోజంతా ముసురు వర్షాల జోరు కొనసాగింది. రైతులు ముసురు వర్షాల్లోనే ఖరీఫ్ పంటల సాగు పనుల్లో భాగంగా మెట్ట పంటలకు ఎరువులు వేయడం, కలుపు తీయడం వంటి పనులు కొనసాగించారు. జంటనగరాల్లో కురిసిన వర్షాలతో మూసీ నదిలో వరద ఉధృతి కొనసాగింది. కేతెపల్లి మూసీ ప్రాజెక్టు పూర్తి మట్టం 645 అడుగులకుగాను 638 అడుగులకు చేరింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో శనివారం నలుగురు వ్యక్తులు వాగుల్లో చిక్కుకుపోయారు. కొన్ని గంటల తరువాత నీటి ఉధృతి తగ్గిన అనంతరం గ్రామస్థుల సహాయంతో వరద నీటి నుంచి బయటపడ్డారు. నల్లబెల్లి పోలీసు స్టేషన్‌ల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఏటూరునాగారం మండలానికి చెందిన నాగేశ్వర్‌రావు కల్వరుపై నుంచి వాగునీరు ఉధృతంగా వెళ్లడంతో వాహనాన్ని నిలిపివేసారు. నాగేశ్వర్‌రావు వాగును దాటే ప్రయత్నంలో నీటి ఉధృతికి కొద్ది దూరం కొట్టుకుపోయాడు.వరద ఉధృతి కొంత తగ్గాక గ్రామస్థులు నాగేశ్వర్‌రావును బయటకు తీసారు. ములుగు మండలం సర్వాపూర్ వద్ద వరినాట్ల కోసం వెళ్లిన మహిళలు సుమలత, రమ, అనుష మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బండలవాగు పొంగడంతో మామిడి చెట్టు ఎక్కి రక్షణకోసం కేకలు వేసారు. చుట్టుపక్కల వారు మహిళలను ఒడ్డుకు తీసుకువచ్చారు. గడచిన 24 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం, మంగపేట తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా సాధారణ వర్షం కురుస్తోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పక్షం రోజులుగా వాన చినుకు కోసం ఎదురుచూస్తున్న ఖరీఫ్ రైతుల్లో కుండపోత వర్షం ఆనందం నింపింది. ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్ డివిజన్‌లలో ముసురుపట్టిన వర్షాలు పత్తి, వరి, చిరుధాన్యాల పంటల ఎదుగుదలకు ఊపిరిపోయగా కాత దశలో ఉన్న సోయాబీన్ పంట సుమారు రెండువేల ఎకరాల్లో దెబ్బతింది. ఆదిలాబాద్, ఉట్నూరు, భైంసా డివిజన్‌లలో 4.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా నిర్మల్‌లో 3.2 సెం.మీటర్లు, ఇంద్రవెల్లిలో అత్యధికంగా 5.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. భారీ వర్షాలకు లోలెవల్ వంతెనలు పలుచోట్ల తెగిపోవడం, కల్వర్టుల పైనుండి వరదనీరు పొంగిపొర్లడంతో 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. చెన్నూర్ మండలం సుద్దాల వంతెన సమీపంలో అప్రోచ్ కల్వర్టు తెగిపోవడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఇంద్రవెల్లి సమీపంలోని చిచుదరి ఖానాపూర్ లోలెవల్ కల్వర్టు దెబ్బతినడంతో 8 గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. ఆదిలాబాద్ నుండి కరీంనగర్ జిల్లాకు వెళ్ళే రహదారిపై ఇందన్‌పల్లి సమీపంలో గల ఆహ్మదాబాద్ అప్రోచ్‌రోడ్డు భారీ వర్షానికి తెగిపోగా రాకపోకలు నిలిచిపోయాయ. కుంటాల, పొచ్చర జలపాతాలు భారీ వర్షంతో జలకళను సంతరించుకున్నాయి. ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు ఎంతగానో మేలు చేసిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.

చిత్రం..జలకళ ఉట్టిపడుతున్న కుంటాల జలపాతం