ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఫలితం రిఫరెండం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19 నంద్యాల అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితం టిడిపి పాలనకు రిఫరెండం కాదని కేంద్ర సహాయ మంత్రి వై సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం శనివారం విశాఖ వచ్చిన ఆయన టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పలు ఉప ఎన్నికలను ఎదుర్కొందన్నారు. ఆయా ఎన్నికల్లో కొన్నింట గెలుపొందామని, మరికొన్ని చోట్ల ఓటమి చవిచూశామన్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు, ఓటములు పరిపాలనకు గీటురాయిగా భావించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత నంద్యాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ అధికార టిడిపి అక్రమాలకు పాల్పడిందంటూ వైకాపా అధినేత జగన్ చేస్తున్న ప్రచారం దొంగే దొంగ.. దొంగ అంటున్నట్టుందన్నారు. ఉపఎన్నికల్లో గెలుపు కోసం వైకాపా పలు అక్రమాలకు పాల్పడుతోందని, వీటిని టిడిపిపై నెడుతోందని ఆరోపించారు. ఉప ఎన్నికలన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఒకేసారి అభివృద్ధి పేరిట నిధుల వరద పారిస్తోందన్న విమర్శలను సుజనా చౌదరి తిప్పికొట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాధాన్యతను బట్టే నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. ఒకప్పుడు విశాఖకు కేటాయించిన నిధులు, ఇప్పుడు చోటుచేసుకున్న అభివృద్ధితో పోల్చిచూస్తే అర్ధం అవుతుందన్నారు.