తెలంగాణ

దేశంలో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు దేశంలోనే మనం నంబర్‌వన్. రాష్ట్రం కావాలంటూ దేనికోసం కొట్లాడామో, ఆ దిశగా అడుగులేస్తున్నాం. నిధులు మనవి. నియామకాలు మనవి. సాంకేతిక ప్రగతి మనది. ఆర్థిక స్వావలంబన మనది. సాధించుకున్న రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, గట్టి
పునాది వేయడానికి రేయంబవళ్లు అధ్యయనంతో సాగునీటి ప్రణాళికలు
రూపొందించుకున్నాం. కారు చీకట్లు తొలగించి, త్వరలోనే 24 గంటల నిరంతర
విద్యుత్ దిశగా అడుగులేస్తున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది.

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఆదాయ వృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఐటీ రంగంలోనూ త్వరలో నంబర్ వన్ కాబోతున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆదాయ వృద్ధి ఈ ఏడాది 15 శాతం నమోదైందన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని దేని కోసమైతే పోరాడి సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. దుర్ముఖి నామ సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన ఉగాది వేడుకలను సిఎం ప్రారంభించారు. పంచాంగ శ్రవణం తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా నిధులు మాకే ఉంటాయని, మా నీళ్లు మాకే ఉంటాయని, మా ఉద్యోగాలు మాకే దక్కుతాయని రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమం చేశారన్నారు. ఇందులో ఇప్పటికే రెండు సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. రాష్ట్రం ఏర్పడితే దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని తాము చెప్పినట్టు జరిగిందని, అలాగే మనకు దక్కాల్సిన ఉద్యోగాలు మనకే దక్కేవిధంగా నియామకాలు జరుగుతున్నయని ముఖ్యమంత్రి అన్నారు. ఇక మిగిలింది ఒక్క నీళ్లేనని, దాని కోసమే తమ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాధించుకున్న కొత్త రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, దానికి పునాధి గట్టిగా వేయడానికి రాత్రింబవుళ్ళు అధ్యయనం చేసి సాగునీటి కోసం ప్రణాళికను రూపొందించుకున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అదే గోదావరి నీటిని తెచ్చుకుని ఉన్నట్టు అయితే ఆ పరిస్థితి ఉండేది కాదన్నారు. గోదావరి నుంచి 1500 టిఎంసిల నీరు వృధాగా సముద్రం పాలైందని, ఆ నీటిని వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో అసలు కరువు అనేదే ఉండేది కాదన్నారు. గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టులకు ఇప్పటికే మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలో మరోసారి వెళ్లి తుది ఒప్పందం చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని కరువును శాశ్వతంగా తరిమికొడుతామన్నారు. భవిష్యత్‌లో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతుందన్నారు. ఇప్పటికే ఆదాయ వృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్నాం, ఐటీలో త్వరలో నంబర్ వన్ కాబోతున్నాం, విద్యుత్ కారు చీకట్టు ఇప్పటికే తొలిగిపోయాయి, త్వరలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తున్నమన్నారు. దేనికి భయపడకుండా ధైర్యంగా శాంతియుతంగా, ముందుకుసాగుదామని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.

చిత్రం... పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్