తెలంగాణ

తెరాసను సవాల్ చేసే శక్తిగా టి-మాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 20: రాష్ట్రంలో సామాజిక వర్గాలతో తెరాసను సవాల్ చేసే శక్తిగా టిమాస్ ఎదుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, టి-మాస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో టిమాస్ ఆవిర్భావ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ మరో మూడునెలల వ్యవధిలో టిమాస్ ప్రజా ఉద్యమంగా మారాలని సామాజికవర్గాలను కలుపుకుని ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. అట్టడుగు కులాల వారు పడుతున్న బాధను ప్రత్యేక్షంగా చూసి వారి కన్నీళ్లను తుడిచేవిధంగా ప్రభుత్వంపై పోరాటం చేసి వారికి అండగా నిలవాలన్నారు. గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో టిమాస్‌ను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏకచత్రాధిపతిగా తన పార్టీకి తిరుగులేదని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పార్టీ టిఆర్‌ఎస్‌కు టిమాస్ సవాల్‌గా ఎదగాలని, అందుకు రాష్ట్ర కమిటీ నుండి మొదలుకుని గ్రామకమిటీ వరకు ఐక్యంగా పనిచేయాలన్నారు. తెలంగాణలో రాజరిక సాలన, కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర వచ్చాయని, అది టిమాస్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. దళితులను, మహిళలను చిన్నచూపు చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ దుర్మార్గమైన పరిపాలనను కొనసాగిస్తున్నారని, ఇలాంటి పాలనను అంతమొందించడానికి సామాజిక వర్గాలన్నీ ఏకం కావాలన్నారు. తమతో కలిసి పనిచేసేవారు కూడా టిమాస్ లక్ష్యాలతో పనిచేయాలని ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను సిపిఎం తరపున పాదయాత్ర చేసిన సందర్భంలో తనకు సంఘీభావం తెలిపారని అన్నారు.
తెరాసకు దీటుగా ఎదిగి కెసిఆర్‌కు ఏ సామాజిక వర్గాలు అయితే అధికార పీఠాన్ని ఇచ్చాయో ఆ పీఠాన్ని సామాజిక వర్గం చేతుల్లోకి వచ్చేందుకే టిమాస్ ఆవిర్భవించిందన్నారు. టిమాస్ విధానాలకు ఆకర్షితులై ఏ పార్టీ అయనా తమతో కలిసి పనిచేయడానికి వస్తే అభ్యంతరం లేదని, వందశాతం సామాజిక వర్గాల ఎజెండానే పాటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గాల్లో రాజకీయ చైతన్యం ఎంతో అవసరమని, అందుకే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా సామాజిక వర్గాలను ఏకం చేయడానికి టిమాస్ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రజాగాయకుడు గద్దర్, ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, సుదర్శన్, టిమాస్ జిల్లా కన్వీనర్ జలజలం సత్యనారాయణ, ప్రజా సంఘాలు, కులసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన టిమాస్ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం