తెలంగాణ

మిషన్ భగీరథకు కాంట్రాక్టర్లు కావలెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 20: ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు ఇంటింటికీ మంచినీటి సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పనులకు కాంట్రాక్టర్ల కొరత ఆటంకంగా మారింది. మిషన్ భగీరథ పనుల్లో భాగంగా గ్రామాల్లో చేపట్టాల్సిన అంతర్గత పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ల కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వేట సాగిస్తున్నా పనుల నిర్వహణకు కాంట్రాక్టర్లు దొరకడం లేదు. దీంతో 3880 కోట్లతో జిల్లాలో చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో ఇప్పటిదాకా 1757 కోట్ల పనులు పూర్తవ్వగా మిగిలిన 2123 కోట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. వచ్చే డిసెంబర్‌లోగా మిషన్ భగీరథ పనులన్నింటినీ పూర్తి చేసి పథకం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్న అధికార యంత్రాంగం సంకల్పానికి కాంట్రాక్టర్ల కోరత ఆటంకంగా తయారైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,420 కోట్ల ఒహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాలకు 600 ప్యాకేజీలకు 730 కోట్లతో నామినేషన్ పద్దతిలో టెండర్లు పిలువగా నాలుగు నెలలుగా కేవలం 1165 ట్యాంకులకు మాత్రమే కాంట్రాక్టర్లు ఒప్పందాలు చేసుకోగా మిగిలిన 1255 ట్యాంకులకు కాంట్రాక్టర్ల కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ వేట సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు సైతం రెడ్‌కార్పెట్ పరిచినా కాంట్రాక్టర్ల కొరత సమస్య తీరకపోవడం అధికారులను ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన పైప్‌లైన్ల నుండి గ్రామాల్లో వేసే అంతర్గత పైప్‌లైన్లు 471 కోట్లతో చేపట్టగా వీటిని చిన్న కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
నాలుగు నెలల్లో పూర్తికి కసరత్తు
మిషన్ భగీరథ పథకాన్ని ఉమ్మడి జిల్లాలో రెండు ప్రధాన సెగ్మెంట్‌లుగా నిర్మిస్తున్నారు. వాటిలో కృష్ణానది నుండి ఎకెబిఆర్ ద్వారా 4.2 టిఎంసిల నీటిని సాగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సరఫరా చేస్తారు. సాగర్ టెయిల్ ఫాండ్ అడవిదేవులపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను 2.9 టిఎంసిని మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు అందిస్తారు. నల్లగొండ ఉదయ సముద్రం రిజర్వాయర్ నుండి 2.3 టిఎంసిని నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను 1.2 టిఎంసిని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సరఫరా చేస్తారు. ఇందుకోసం 3,880 కోట్ల పథకానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. పథకంలో భాగం ఇప్పటికే 1,757 కోట్ల పనులు పూర్తికాగా ప్రధాన పైప్‌లైన్లు 7025 కిలోమీటర్లుకుగాను 5,250 కిలోమీటర్లు వేశారు. ప్రధాన పైప్‌లైన్లు 4,225 కిలోమీటర్లకుగాను 2,530 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇన్‌టెక్, ఆఫ్‌టెక్ పూర్తవ్వగా, ఒవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు 117కు 76, గ్రౌండ్‌లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు 185కు గాను 143 పనులు పూర్తయ్యాయి. ఐదు ఫిల్టర్ ప్లాంట్ల పనులు అధిక శాతం పూర్తవ్వగా గ్రామాల్లో నిర్మించాల్సిన అంతర్గత పైప్‌లైన్లు, ఒహెచ్‌ఎస్‌ఆర్ పనులకు మాత్రం గుత్తేదారుల కొరత ఎదురవుతోంది. ఎలాగైనా గుత్తెదారుల కొరతను అధిగమించి నిర్దేశిత గడువు డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ల కోసం ప్రయత్నిస్తునే ఇప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమ ట్యాంకుల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేస్తే మళ్లీ వారికే కొత్త ట్యాంకులు కట్టబెడుతూ ముందుకు సాగుతున్నారు.

చిత్రాలు..గ్రామాల్లో మిషన్ భగీరథ అంతర్గత పైప్‌లైన్లు, ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణాల పనులు