తెలంగాణ

రైలు కిందపడి కవలల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, ఆగస్టు 21: సికింద్రబాద్ నుండి ముంబయ వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి కవలలు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే ఎస్‌ఐ సాహునాయక్ తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చందన చంద్రం-్భనుశ్రీలకు మూడేళ్ల క్రితం ఇద్దరు మగ కవల పిల్లలు చందన విఘ్నేష్, విద్వేష్ జన్మించారు. వీరి ఇంటి సమీపంలో 300 మీటర్ల దూరంలో రైలు పట్టాలు ఉన్నాయి. సోమవారం ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంలోని కొట్టంలో ఆడుకుంటామని చెప్పి వెళ్లారు. ఇద్దరూ ఆడుకుంటూ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రైలు పట్టాలు ఎక్కారు. అదే సమయంలో సికిందరాబాద్ నుండి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా వారిపై నుండి వెళ్లడంతో చిన్నారులు మృతి చెందారు. దీనిని గమనించిన గ్రామస్థులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
రైలు ప్రమాదంలో ఇద్దరు కవల పిల్లలు మృతి చెందడంతో నర్సన్నపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారులు రైలు కింద పడి మృతి చెందడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. ప్రమాద వార్త తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని రైలు వేగానికి ఎగిరిపోయిన చిన్నారుల మృతదేహాలను చూసి చలించిపోయారు.