తెలంగాణ

ఓటర్ల జాబితా తుది ప్రచురణను రీషెడ్యూలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ 19 లక్షల 71 వేల తొలగించనున్న ఓటర్ల జాబితాను రీ-వెరిఫికేషన్ చేసి తుది జాబితాను సిద్ధం చేయడానికి ఇచ్చిన గడువును పెంచాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ముఖ్య నాయకులతో సమావేశమై ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్వర్యం లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీకి, తాజాగా వివిధ కార్పోరేషన్లకు పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో పాటు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, టి.పిసిసి అధికార ప్రతినిధులు జి. నిరంజన్, కమలాకర్ రావు, మేధావుల ఫోరం చైర్మన్ శ్యాంమోహన్, రంగారెడ్డి జిల్లా నాయకుడు కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మర్రి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రం స్థాయిలో అధికారులు డోర్ టు డోర్ సర్వే చేయడానికి ఇచ్చిన రెండు వారాల గడువును మూడు వారాలకు పెంచాలని కోరారు. నోటీసులు ఇచ్చే వ్యవధిని మూడు వారాలకు పెంచాలన్నారు. ఈ ప్రక్రియ గత నెల 25న ప్రారంభమవుతుందని ప్రకటించినా, ఇంత వరకు తొలగించబడే ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీలకు అందజేయలేదని ఆయన తెలిపారు.