తెలంగాణ

నెత్తురోడిన జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకిడి, ఆగస్టు 22: కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం బెండార గ్రామం వద్ద గల మూలమలుపు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాంకిడి మండలంలో జరిగిన భవానిమాత జాతరకు వచ్చి టిఎస్ 1యుబి 5055 అనే నెంబర్ గల ఆటోలో తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అసలు కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ ఘటనలో కెరమెరి మండలం లింబుగూడ గ్రామానికి చెందిన మోహర్లె సంతోష్ (18) ఆదే తిరుపతి (22), ఇదే మండలంలోని అగర్‌వాడ గ్రామానికి చెందిన వెడ్మ అంబారావు (25), అక్కడికక్కడే చనిపోగా, ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఝరి గ్రామానికి చెంది న లెండ్గూరే రమేష్ (14) చనిపోయాడు. అదేవిధంగా అగర్వాడ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్(18), లింబుగూడకు చెందిన ఇగ్గిరాపు నవీన్ (15) మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ చనిపోయారు. కెరమెరి మండలంలోని ఝరి గ్రామానికి చెందిన టాకరె రవిందర్ (18), సాంగ్వి గ్రామానికి చెందిన మోహార్లె రాంచందర్, (22), లింబుగూడ గ్రామానికి మోహర్లె తిరుపతి (17), మోహర్లె సతీష్ (22), అగర్‌వాడ గ్రామానికి చెందిన మోహర్లె గణేష్ (18) మోహర్లె రాందాస్ (20)లకు తీవ్ర గాయాల య్యాయి.
సంఘటనా స్ధలానికి సిఐ శ్రీనివాస్ బృందం చేరుకొని క్షతగాత్రులను వెంటనే 108 సహాయంతో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.