తెలంగాణ

నిష్కళంక నాయకుడు నర్రా రాఘవరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, ఏప్రిల్ 9: రాజకీయాల్లో ప్రజాసేవల్లో ఎలాంటి అవకాశవాదాలకు తావుండకూడదని ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేయాలేకాని అవకాశవాద రాజకీయాలకు తావులేకుండా పాలకులకు నాయకులకు ప్రజాశ్రేయస్సే పరమావధిగా కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వట్టిమర్తి బస్‌స్టేజి సమీపంలో శనివారం సిపిఎం శాసనసభాపక్ష మాజీ నేత నర్రా రాఘవరెడ్డి కాంస్య విగ్రహాన్ని చుక్కా రామయ్య తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, మల్లు స్వరాజ్యం, నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డిలతో పాటు పలువురు నాయకులు అభిమానులతో కలిసి ఆవిష్కరించారు. మొదటగా విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి రాఘవరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాచమళ్ళ రామచంద్రం అధ్యక్షతన నిర్వహించిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజాసమస్యలకై రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తాయని ప్రపంచంలో ఎక్కడైనా రాజకీయ పార్టీలు లేనిదే ప్రభుత్వాల పరిపాలనలు లేవని రాజకీయ పార్టీలతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయని అట్టి ప్రభుత్వాలు ప్రజాసమస్యల పరిష్కారంకై అభివృద్ధి కార్యక్రమాలకై పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీల పోరాటాల్లో ఉద్యమాల్లో పోటీలు పడాలని అవకాశవాద రాజకీయాల కోసం పాకులాడకూడదన్నారు. ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ప్రజల నాయకుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా, శాసనసభాపక్ష నేత నర్రా రాఘవరెడ్డి చట్ట సభలో ప్రజాసమస్యలను పిట్ట కథల రూపం, సామాన్యప్రజల గొంతులా వివరిస్తుంటే పాలకపక్షంతో పాటు గా సభలోని ప్రజాప్రతినిధులంగా శ్రద్ధగా ఆలకించేవారన్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలకై అభివృద్ధి కార్యక్రమాలకై ప్రభుత్వంతో పోరాడారని పలు పర్యాయాలు రాఘవరెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.