తెలంగాణ

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో రెండు కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణంలో సిబిఐ, సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం తాజాగా మరో రెండు కేసులు నమోదైనట్టు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన అధికారుల ఫిర్యాదుతో ఇప్పటికే రూ. 58.5 కోట్ల నిధుల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్గత ఆడిట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన రూ. 17.93 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సింగపూర్ టౌన్ షిప్ బ్రాంచిలో రూ. 10.07 కోట్లు గల్లంతైనట్టు ఓ సీనియర్ ఆడిట్ అధికారి ఫిర్యా దు మేరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి బ్రాంచి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం బ్రాంచిలో జరిగిన డిపాజిట్ల కుంభకోణంలో ముగ్గురు సిహెచ్‌వికె కుమార్, దామోదరన్ మణి, కెవి రమణరావు అరెస్టయ్యారు. ప్రస్తుతం తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రెండు కేసుల్లో కూడా వీరి హస్తం ఉన్నట్టు సిబిఐ అధికారులు భావిస్తున్నారు. గురువారం సిహెచ్‌వికె సాయికుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా డిపాజిట్ల కుంభకోణంలో ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు వెల్లడైనట్టు తెలిసింది. చెన్నైకు చెందిన ఫ్రాంక్లిన్ అలియాస్ విజయ్‌కుమార్ కీలక సూత్రధారిగా గుర్తించినట్టు సిబిఐ అధికారి ఒకరు తెలిపారు. విజయ్‌కుమార్ కోసం గాలిస్తున్నామని, ఫ్రాంక్లిన్‌ను విచారిస్తే మరికొందరి పేర్లు బయటకు వస్తాయని త్వరలో నిందితులను పట్టుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.