తెలంగాణ

పరడలో పురాతన ఆనవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, ఏప్రిల్ 9: నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో పురాతన కాలం నాటి చారిత్రాత్మక ఆనవాళ్లు లభ్యమయ్యాయి. 800 సంవత్సరాల క్రితం నాటి పలు పురాతన వస్తువులు గ్రామస్థులకు లభించాయి. 11వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం, నవీనా శిలం యుగానికి చెందిన రాతి గొడ్డలి, ఐదు తలల నాగదేవతా విగ్రహాలు గ్రామశివారులోని శివుని గుట్ట వద్ద లభించాయి. కొన్ని నెలల క్రితమే ఇవి గ్రామస్థులకు లభ్యమైనప్పటికీ ఇన్ని రోజులు ఈ విష యం ప్రచారం కాలేదు. గ్రామశివారు లో ఉన్న గుట్టపై పురాతన శివాలయం ఉంది. వందల సంవత్సరాల క్రితం ఈ గుట్ట వద్ద శివునిపాడు అనే గ్రామం ఉండేదని, గుట్టకు సమీపంలో పేరుమాళ్లపాడు అనే గ్రామం ఉండగా ఔరంగజేబు కాలంలో మహ్మదీయు లు దండయా త్ర చేసి ఆ గ్రామాలను నేలమట్టం చేసినట్లు చెబుతున్నారు. గుట్ట వద్ద నవీన శిలాయుగం నాటి రాతిగొడ్డలి లభ్యం కాగా గుట్టపై పలు చోట్ల గొడ్డలికి పదును పెట్టే రాతి గుంటలు సైతం కన్పిస్తున్నాయి.