తెలంగాణ

ఆలయాలకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: కృష్ణా పు ష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో చారిత్రక దేవాలయాలు, కోటలు, పర్యావరణ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.900 కోట లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందు లో రూ. 398 కోట్లతో ఈ రెండు జిల్లాల్లోనే రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. జాతీయ స్ధాయిలో పర్యావరణ పర్యాటక ప్రదేశాల పటంలో తెలంగాణకు స్ధానం కల్పించే లక్ష్యంతో అనేక ప్రదేశాలను గుర్తించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోల 116 చారిత్రక మాన్యుమెంట్లు ఉన్నాయి. తెలంగాణ లో ఇంతవరకు 336 చారిత్రక ప్రదేశాలను గుర్తించారు. నల్లగొండ జిల్లాలో చందంపేట మండలంలోని దేవాలయాలు, రేచర్ల పద్మనాయకులు 12వ శతాబ్ధంలో నిర్మించిన కోటలకు తెలంగాణ గర్వించదగిన ఘన చరిత్ర ఉంది. ఈ జిల్లాలో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ వద్ద ఉన్న గాజుబేడ వద్ద రెండు గుహలు, దేవరచర్ల వద్ద శివాలయం ప్రాశస్యమైనవిగా గుర్తించారు. సోమశిల-అక్కమహదేవి గు హలు, ఉమామహేశ్వరం దేవాలయం- మన్ననూరు- ఫర్హాబాద్, మల్లెలతీర్ధం, శ్రీశైలంను పర్యావరణ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించారు.