తెలంగాణ

గిరిజనుల రిజర్వేషన్ల కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, ఏప్రిల్ 9: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రావడంతో మన నిధులు మనకే వరదలా వస్తున్నాయని, కరెంటు కష్టాలు తీరాయని పేర్కొన్నారు. శనివారం మెదక్ మండలంలోని షమ్నాపూర్, గంగాపూర్, పాతూర్, ర్యాలమడుగు, మాచవరం, హవేళీఘణాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీపురుదుబ్బ తండా, ర్యాలమడుగు, హవేళీఘణాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కోసం కృషి జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం 9.6 శాతం జనాభా ఉందని, కాయితీ లంబాడీలను కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణవస్తే చీకట్లు కమ్ముకుంటాయన్నవారికి సమాధానం 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడమేనన్నారు. రైతులకు 9 గంటల కరెంటు కూడా సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడంతో వల్ల కరెంటుతో పాటు నిధులకు ఇబ్బందుల్లేకుండా మంజూరవుతున్నాయన్నారు. రెండేళ్లలో నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. 60 యేళ్ల పరాయి పాలనలో ఎంతో నష్టపోయామన్నారు. కృష్ణా, గోదావరి జలాలు సద్వినియోగానికి బృహత్ కార్యాచరణ చేస్తున్నారన్నారు. ఘన్‌పూర్ ఆనకట్ట ఎత్తుపెంపు, కాలువల ఆధునీకరణకోసం వంద కోట్ల రూపాయలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. మిషన్ కాకతీయలో గత సంవత్సరం 130 చెర్వులు, ఈ సంవత్సరం 230 చెర్వుల పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. 111 సంవత్సరాల చరిత్రలో ఘన్‌పూర్ ఆనకట్టకు రూపాయిల కూడా ఖర్చు చేయలేదన్నారు. తాగునీటి ఇబ్బందులు తొలగించడానికి భగీరథ పథకం ద్వారా వచ్చే యేడాది ఇంటింటికి నల్లా నీరు అందజేస్తామన్నారు. 910 కోట్ల రూపాయలతో మూడు నియోజకవర్గాలు, మెదక్ పట్టణానికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. రూ.3 కోట్లు నియోజకవర్గంలో ఎండాకాలంలో పైప్‌లైన్‌ల ఏర్పాటు, మోటార్‌ల బిగింపు, అత్యవసర సమయాల్లో వినియోగించడానికి మంజూరయ్యాయని పద్మాదేవేందర్‌రెడ్డి వివరించారు. ఉపాధ్యాయులు మంచి విద్యాబోధనచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.