తెలంగాణ

మలేసియాలో ఘనంగా ఉగాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: అన్నింటిలో కలిసి పోయే గుణాలు తెలుగు భాషలో ఉన్నాయని, తెలుగు వాళ్లం కలిసే ఉంటామని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. తెలుగు భాష గొప్పదని ఆమె అన్నారు. శనివారం మలేసియాలోని కౌలాలంపూర్‌లో మలేసియా తెలుగు ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లాడుతూ తెలుగు భాష విశిష్టతను కవిత రూపంలో వినిపించారు. మలేసియాలోని తెలుగువారందరికీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఉగాది అంటే ఒక యుగాన్ని ప్రారంభించిన రోజని, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడున్నా ఉగాది పండుగ రోజు రెండు విషయాలను మరచిపోరన్నారు. ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం, మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేయడం రెండోది అని చెప్పారు. తెలుగు రాష్ట్రం విడిపోయినా, రెండు రాష్ట్రాల్లో విజన్ ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారని, వారి సహకారంతో తెలుగుతనాన్ని కాపాడుకుందామన్నారు. మలేసియా ప్రభుత్వం చొరవ చూపి తెలుగువారి పండుగను ఘనంగా నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. తెలుగు సినిమాల్లో విలువలు పడిపోతున్నాయని, ఇంగ్లీషు పదాలను ఎక్కువగా వాడుతున్నారన్నారు. 150 సంవత్సరాల క్రితం మలేసియాకు వచ్చిన వారు చిన్న సంఘాలు పెట్టుకుని భజనలు, కీర్తనలు చెప్పుకుని, పాటలు పాడుకుంటూ బడులు పెట్టుకుని మన భాషను బతికించుకున్నారన్నారు.