తెలంగాణ

రియల్టీలోకి సర్కారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధుల సమీకరణపై సర్కారు దృష్టి పెట్టింది. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతుల రుణ మాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాల నిధుల కోసం బ్యాంకుల వైపు చూస్తున్న ప్రభుత్వం, పనిలో పనిగా రాష్ట్రంలో నిరర్థకంగా పడివున్న భూములను అమ్మాలన్న పాత ఆలోచనకు కొత్తగా పదును పెడుతోంది.

నిరర్థక భూముల విక్రయానికి సన్నాహాలు
రూ. 14 వేల కోట్లు రావొచ్చని అంచనా
రాజధాని, రంగారెడ్డి నుంచే 10 వేల కోట్లు
టిఎస్‌ఐసిసి, జిల్లా కలెక్టర్ల ద్వారా వేలం
నోటిఫికేషన్ జారీకి సిఎం కెసిఆర్ ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ప్రభుత్వ నిరర్ధక భూముల విక్రయానికి సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. అమ్మకాల ద్వారా వచ్చే నిధుతో ప్రతిష్టాకర పథకాలు పూర్తి చేయాలని యోచిస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథవంటి అభివృద్థి కార్యక్రమాలతోపాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతుల రుణ మాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. వీటి కోసం సింహభాగం నిధులను బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, వేడి నీళ్లకు చన్నీళ్లు తోడులా భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను వినియోగించాలని భావిస్తుంది. ప్రభుత్వ భూముల వేలానికి విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా సిఎం కె చంద్రశేఖర్‌రావు తాజాగా రెవిన్యూ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించారు. వాస్తవానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ నిరర్ధక భూములను వేలం వేసి రూ. 13,500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని 2014-15 బడ్జెట్‌లోనే అంచనా వేసింది. అయితే ప్రభుత్వ భూముల వివరాలు, వివాదాలు లేని భూములు? భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఎంత భూమి అవసరం? తదితర అంశాలపై రెవిన్యూ శాఖ వద్ద సమాచారం లేకపోవడంతో భూముల అమ్మకం ప్రక్రియ ప్రారంభం కాలేదు. గడచిన 20 నెలలలో ప్రభుత్వ భూములను గుర్తించి జిల్లాల వారీగా ల్యాండ్ బ్యాంక్‌లను రెవిన్యూ శాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే భూములను వీటినుంచి మినహాయించి ఇతర నిరర్ధక భూములను వేలం వేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ నిరర్ధక భూములు 12,500 ఎకరాలు ఉన్నట్టు లెక్క తేలింది. వీటిని వేలం వేయడంద్వారా సుమారు రూ. 14 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి జిల్లాలోని భూములు అత్యంత ఖరీదైనవి కావటంతో ఈ రెండు జిల్లాల నుంచే సుమారు రూ. 12 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఒక్క హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వేలం ద్వారా రూ. 7,500 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ. 5 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే భూముల అమ్మకం ద్వారా రూ. 10 వేల కోట్లు వస్తాయని ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన శ్రీ్ధర్ గతంలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే భవిష్యత్‌లో ప్రభుత్వ అవసరాలకు రంగారెడ్డి జిల్లాలోని భూములనే వినియోగించుకోవాల్సి ఉండటంతో, ఇక్కడ భూములను గుర్తించి వాటిలో సగం మాత్రమే వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో తాజాగా రంగారెడ్డి జిల్లాలో భూముల వేలం ద్వారా రూ. 5 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలి విడతలో హైదరాబాద్‌లో 400 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 850 ఎకరాలను వేలం వేయడానికి భూ పరిపాలన శాఖ (సిసిఎల్‌ఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. హెచ్‌ఎండి పరిధిలో భూముల వేలాన్ని రాష్ట్ర పారిశ్రామిక వౌలిక వసతుల కల్పన సంస్థ (టిఎస్‌ఐసిసి), జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో భూముల వేలాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనున్న తరుణంలో భూముల అమ్మకం ప్రక్రియను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. భూముల వేలానికి సంబంధించిన నోటిఫికేషన్లను త్వరలోనే జారీ చేయాల్సిందిగా ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సిసిఎల్‌ఏ కమిషనర్ రేమాండ్ పీటర్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.