తెలంగాణ

భళా.. కూన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ చరిత్ర, ఉద్యమం, రాష్ట్రావిర్భావం, ప్రస్తుత మంత్రివర్గం తదితర అంశాలపై గుక్కతిప్పుకోకుండా సమాధానాలు చెప్పే మూడవ తరగతి చిన్నారి శ్రీలక్ష్మి శ్రీజ ప్రతిభకు సిఎం కెసిఆర్ మంత్రముగ్దుడయ్యారు. చిన్నారి ప్రతిభా పాటవాలను మెచ్చుకుంటూ భవిష్యత్‌లో మంచి చదువులు
చదవుకోవాలిని ఆశీర్వదిస్తూ సిఎం తన సొంత డబ్బు 10 లక్షల 16 రూపాయాల నజరానా అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సుధారాణి, కిరణ్‌కుమార్ దంపతులు తమ కూతురితో కలిసి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సిఎంని కలిశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మిశ్రీజ కాకతీయ రాజుల స్వర్ణయుగం, శాతవాహనుల పాలన, నిజాం పాలన, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తదితర అంశాలపై సిఎం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పింది. అలాగే ‘ఏ పేరున నను దయతలచెదవో’ అని ప్రజలు ఏది కోరుకున్నా వాటిని తీర్చే నాయకుడు కెసిఆర్ అని ముద్దుముద్దగా చెప్పింది. దీంతో ముగ్దుడైన సిఎం తన సొంత ఖాతా నుంచి 10 లక్షల 16 రూపాయలకు చెక్ అందించి ఆశ్వీరిదించి ఇంకా బాగా చదువుకోవాలని ఆశ్వీరించారు. అలాగే ఖమ్మం వచ్చినప్పుడు లక్ష్మిశ్రీజ ఇంటికి వచ్చి భోజనం చేస్తానని కూడా సిఎం ఈ సందర్భంగా మాట ఇచ్చారు.

చిత్రం... చిన్నారి శ్రీజను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని దీవిస్తున్న సిఎం కెసిఆర్