తెలంగాణ

భావి తరాలు క్షమించవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 10: ఆరు దశాబ్దాలుగా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు, వనరుల దుర్వినియోగం కొనసాగుతుండగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన తర్వాత సైతం అదే తంతు కొనసాగుతోందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలోని పివైఅర్ గార్డెన్స్‌లో ‘దగా పడుతున్న తెలంగాణ అంశం’పై ఆదివారం జరిగిన మేథో మధన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాంతియుత పద్ధతుల్లో, ప్రజాస్వామ్య మార్గాన అన్ని వర్గాల పోరాటం ఫలితంగా ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, కార్మికుల ఆకలిపోరాటం వంటి సమస్యలు సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నా రు. ఇప్పటికైనా మేధావి వర్గాలు స్పందించకుంటే భవిష్యత్ తరాలు వారిని క్షమించవని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాల్లో పాలుపంచుకున్న ఉద్యమకారులను పక్కనపెట్టి ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యపడుతుందని ఆయన నిలదీశారు. ముఖ్యంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో ప్రజాధనం పక్కదారి పడుతుందే తప్ప రైతులు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చేనాటికి ఉన్న మిగులు బడ్జెట్ ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబి లో కూరుకుపోయి అభివృద్ధిపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగం సైతం నిర్లక్ష్యానికి గురై కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యా నించారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించి ప్రభుత్వమే నడిపించి కార్మికులను ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. వ్యవసాయరంగానికి పెద్దపేట వేస్తూ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రుణమాఫీని ఏకకాలంలో వర్తింపజేయాలని, బ్యాంకర్లు తిరిగి రుణాలిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేటలలో నిర్మించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌బెడ్రూం ఇళ్ల్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుండగా, ఆటోమేటిక్ స్టార్టర్ల అంశంపై ఒక్క రైతుపైన కేసు చేసినా సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రజా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షు డు గాదె ఇన్నయ్య మాట్లాడుతూ టిఅర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో తనను వాడుకుని వదిలేసిన కెసిఆర్ ఉద్యమకారులను వెన్నుపోటు పొడవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శ్రీనివాస్‌యాదవ్, కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటివారిని పక్కన బెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, డాక్టర్ జి.లచ్చ య్య, నాగప్రసాద్‌గౌడ్, శ్రీశైల్‌రెడ్డి, 10 టివి మల్లన్న, నీరుటి రాజన్న, పరందామ్, రాజేందర్‌రెడ్డి, విక్రం సదస్సులో ప్రసంగించారు.

ప్రసంగిస్తున్న రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్

వడదెబ్బతో 10 మంది మృతి
ఆంధ్రభూమిబ్యూరో
నల్లగొండ/కరీంనగర్/ఆదిలాబాద్/నిజామాబాద్/వరంగల్, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆదివారం ఎండల తీవ్రత కారణంగా 10 మంది మరణించారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నూకల రాములు (59), నూతన్‌కల్ మండలం పెదనెమిల ఆవాస గ్రామం భాగ్యతండాకు చెందిన గుగులోతు యలమంద (70), పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్‌నాయక్‌తండాకు చెందిన వ్యక్తి సపావత్ తుల్యానాయక్ (52), వడదెబ్బకు గురై మృతి చెందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల పరిధిలోని రాగంపేట గ్రామానికి చెందిన వెల్గటూరు ఎల్లవ్వ (50), కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొబ్బల సమ్మయ్య (45) అనే వ్యవసాయ కూలీ, నిజామా బాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్లా రోడ్డులోని బైపాస్ రోడ్డుపై గైని నాగరాజు (35) అనే వికలాంగుడు, బోధన్ మున్సిపల్ కార్యాలయంలో షానిటరీ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు రవి (35), ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం లక్ష్మిపూర్‌కె గ్రామానికి చెందిన శకుంతల (43) అనే మహిళ, వరంగల్ జిల్లా చేర్యాల మండ లం ఐనాపూర్ గ్రామంలో వేములవాడ కిరణ్(16) అనే విద్యా ర్థి, మానుకోట మండలం మాధవపురం గ్రామానికి చెందిన నక్క ముత్యాలు(65) ఆదివారం వడదెబ్బతో మృతి చెందారు.
నాకు ప్రాణహాని ఉంది..
రక్షణ కల్పించండి!
అత్తింటి ఆరళ్లపై దౌల్తాబాద్ జడ్పీటిసి వీరమణి
దౌల్తాబాద్, ఏప్రిల్ 10 : తన అత్తింటివారితో తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని మెదక్ జిల్లా దౌల్తాబాద్ జడ్పీటిసి సబ్యురాలు వీరమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అంకిరెడ్డిపల్లిలోని ఆమె పుట్టింట్లో విలేఖరులతో మాట్లాడుతూ తనపై గృహహింసకు పాల్పడుతున్న తన భర్తతోపాటు కుటుంబ సభ్యులపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదుచేశానని తెలిపారు. దీంతో తనపై మరింత కక్ష పెంచుకున్న అత్తింటివారు పలువురిని తనపైకి ఉసిగొల్పుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తరచూ తనవద్దకు పలువురు వ్యక్తులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నరని పేర్కొన్నారు. దీంతో తాను భయబ్రాంతులకు గురవుతున్నానని తనకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు విన్నవిస్తానని చెప్పారు.
మావోయిస్టు నేత రవి
అంత్యక్రియలు పూర్తి
చింతపల్లి, ఏప్రిల్ 10: మావోయిస్టు అగ్రనేత కుడుమల వెంకటరమణ అలియాస్ రవి అంత్యక్రియలు ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగిలో పూర్తయ్యాయి. అనారోగ్యంతో రవి మెరుగైన వైద్య సేవలకై విశాఖపట్నం వెళ్తూ మార్గం మధ్యలో శనివారం మృతి చెందిన విష యం తెలిసిందే. శనివారం సాయంత్రం చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి తీసుకువచ్చిన రవి మృతదేహానికి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, జోగమ్మ, అన్నయ్య శేఖర్, కుటుంబ సభ్యులు , స్నేహితుల , బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హాజరయ్యారు.

లొంగిపోయిన
మావో సానుభూతిపరులు
సీలేరు, ఏప్రిల్ 10: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా మత్తి లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం 188 మంది మావోయి స్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహపొదర పంచాయతీకి చెందిన గాలిగూడ, డొగ్రిగూడ గ్రామాలకు చెందిన 25 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, 10 మంది గ్రామ కమిటీ సభ్యులు, 81 మంది మహిళా మావోయిస్టు సానుభూతి పరులు, మరో 72 మంది పురుష మావోయిస్టు సానుభూతిపరు లు మత్తిలి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎదుట ఆదివారం ఉదయం లొం గిపోయారు. వారికి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్య లు తీసుకుంటామని పోలీస్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.
కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయ్!
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఏప్రిల్ 10: భారత రిజర్వు బ్యాంకు ద్వారా కొత్త రూ. 500 నోట్లను విడుదల చేసింది. పాత నోట్ల కంటే ఇవి కొంచెం భిన్నంగా ఉన్నాయి. కొత్త నోట్లలో ఎడమ, కుడి చివర్లలో మొత్తం ఐదు గీతాలను అందరికీ కనపడేలా ముద్రించారు. నోట్ల పైన కరెన్సీ సంఖ్యను ప్రత్యేకంగా ముద్రించారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజులో ఈ సంఖ్యలను ముద్రించారు. చివరి మూడు సంఖ్యలను అతి పెద్దవిగా ముద్రించారు. గవర్నర్ రఘురామ్ రాజన్ సంతకంతో ఈ రూ.500 నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేసింది. అలాగే ఈ నోట్ల వెనుక భాగాన కూడా రూ.500 సంఖ్యను, అక్షరాలను పెద్దవిగా ముద్రించారు. నకిలీ కరెన్సీ చలామణి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు పలు జాగ్రత్తలు తీసుకుని ఈ నోట్లను విడుదల చేసింది.

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల ఘర్షణలో..
బయటపడ్డ తుపాకులు!

నంగునూరు, ఏప్రిల్ 10: అంతర్రాష్ట్ర ము ఠా సభ్యుల ఘర్షణలో ఒకరికి తీవ్ర గా యా లు కాగా, మూడు తుపాకులు బయటపడ్డ సంఘటన మెదక్ జిల్లా నంగునూరు మం డలం సిద్దిపేట- వరంగల్ రహదారి రాంపూర్ క్రాసింగ్ వద్ద కలకలం రేపింది. దీనికి సంబం ధించిన వివరాలు ఇలా...మండలంలోని బద్దిపడగ మధిర గ్రామమైన జెపి తండాకు చెంది న లంబాడీ శ్రీనివాస్‌కు చెందిన రాం పూర్ క్రాసింగ్ వద్ద ఉన్న ఇంటిని పూణేకు చెందిన 5గురు వ్యక్తులు పైప్‌లైన్ పనులు ఉన్నాయని కిరాయికి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా బస్వాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇందుకు సహకరించారు. ఈ క్రమం లో శనివారం రాత్రి కిరాయికి ఉంటున్న ఐదుగురిలో శ్యాం సుందర్ అనే వ్యక్తితో గొడవపడి మిగ తా నలుగురు చితకబాదారు. దీం తో దారిన పోయేవారు అక్కడకు వెళ్లి చూసేసరికి శ్యాం సుదర్ అనే వ్యక్తి తీవ్రగాయాల పాలై కనిపించాడు. మిగిలిన నలుగులు వ్యక్తులు పారిపోగా కృష్ణ అనే వ్యక్తి దొరకడంతో చితకబా ది పోలీసులకు అప్పజెప్పారు. పరుగులు తీస్తున్న ఒకతని నుంచి తుపాకీ కిందపడిం ది. పోలీసులు సో దా చేయగా 3తుపాకులు, 11బుల్లెట్లు లభ్యమైనాయి. మగిలిన ముగ్గురు పరారైనారు. వారి కోసం పోలీసు లు గాలిస్తున్నా రు. కరీంనగర్, వరంగల్ జిల్లా సరిహద్దుల పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి గాలిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ ప్రసన్నకుమార్, ఎస్‌ఐలు గోపాల్‌రావు, సత్యనారాయణ సందర్శించారు.