తెలంగాణ

ఏడాదిపాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ 125వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని, అలాగే హైదరాబాద్ ఎన్టీఆర్ పార్క్‌లోని పార్టీ జోన్‌లో దేశంలోనే అత్యంత పొ డవైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 14న బోరబండలో దళిత్ స్టడీ సెంటర్‌కి, నెక్లెస్‌లోడ్‌లో విగ్రహ నిర్మాణానికి శం కుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభ లో ప్రసంగిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ పార్క్‌లో నాలు గు ఎకరాల స్థలంలో ఎన్టీఆర్ మెమోరియల్ ఉందని, దానిని పరిరక్షిస్తూనే అంబేద్కర్ స్కైయిర్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీని వేశారని మంత్రులు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాల నాయకులను, అం బేద్కర్ అభిమానులను కమిటీలో భాగస్వాములను చేయనున్నట్టు మంత్రులు తెలిపారు.