తెలంగాణ

డిగ్రీకి సైతం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది విద్యా సౌకర్యాలను పెంచడం, విద్యార్థులను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం ఆయన వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపట్టనున్నట్టు శ్రీహరి తెలిపారు. మండలాల వారీగా విద్యా సంస్థల వివరాలను, ఇతర సౌకర్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాటిని రికార్డు చేస్తామని, తద్వారా వివిధ సంస్థల్లో ఉన్న సౌకర్యాల వివరాలను విద్యార్థులు ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. ఈ ఏడాది నుండి డేటాను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. జూన్ 13వ తేదీ నాటికి జూనియర్, డిగ్రీ, ఫార్మసీ కళాశాలలు బయోమెట్రిక్ పరికరాలను, సిసి కెమేరాలను ఆయన ఆదేశించారు. ‘టెట్’ ఫలితాలు వెలువడే నాటికి ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు వారంలోగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాఠశాలల్లో నిర్ధేశించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే వాడేలా తనిఖీలు చేపట్టాలని, కనీస సౌకర్యాలు, వౌలిక వసతులు ఉంటేనే ప్రైవేటు విద్యా సంస్థల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డిఇఓలను ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరంలో సకాలంలో ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.