తెలంగాణ

పిజి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఉస్మానియా యూనివర్శిటీతో పాటు తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు, అనుబంధ, ప్రైవేటు పిజి కళాశాలల్లో 2016-17 విద్యాసంవత్సరానికి 3ఒయుసెట్-20162 నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అభ్యర్ధులు ఈ నెల 13 నుంచి మే 7వ తేదీ వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుందని పిజి అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి చెప్పారు. నాలుగు వర్శిటీల్లో ఎంఎ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసిజె, ఎంఎల్‌ఐసి, ఐదేళ్ల పిజి కోర్సులు, పిజి డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని ఆయన చెప్పారు.