తెలంగాణ

మాకు సలహాలు ఇస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: అంతర్గత ప్రజాస్వామ్య విలువలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించనున్న ఆందోళనల కోసం ‘పోరుబాట’ పేరిట రూపొందించిన సిడిని మంగళవారం సురవరం సుధాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ వాస్తవాలను తెలియజేసే విధంగా రచయితలు, గాయకులు పాటలు పాడారని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిడవిల్లుతుందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తీకరణకు, భావ వ్యక్తీకరణకు అవరోధాలు లేనప్పుడు మాత్రమే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల దాడికి అడ్డుఅదుపు లేకుండా పోయిందన్నారు. సైద్ధాంతిక దాడులు పెరిగి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు గౌరి లంకేశ్ హత్యకు పాల్పడిన వారిని, పనామా కంపెనీ విషయంలో దోషులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని సురవరం డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టు గౌరి లంకేశ్ హత్య తర్వాత ఐలయ్యలాంటి వాళ్ళపై దాడులు పెరిగే అవకాశం ఉంది వారికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చాకలి ఐలయ్య విగ్రహం ట్యాంక్ బండ్‌పై పెడతాం అంటూనే రైతాంగ పోరాట వారోత్సవాలు ఎందుకు నిర్వహించరని ఆయన ప్రశ్నించారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో ‘పోరుబాట’ సిడిని ఆవిష్కరిస్తున్న సిపిఐ నేతలు నారాయణ, సురవరం, చాడ వెంకట్‌రెడ్డి