తెలంగాణ

సినిమాల నిర్మాణానికి ‘సింగిల్‌విండో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: సినిమాల నిర్మాణానికి వివిధ శాఖల అనుమతులను పొందేందుకు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చివేసి ‘సింగిల్ విండో’ విధానాన్ని తెస్తున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సినిమాల నిర్మాణానికి ప్రస్తుతం వివిధ శాఖల అనుమతులు పొందేందుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, అందువల్ల సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించామని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రజలు సినిమా చూసేందుకు ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని, థియేటర్ల యజమానులు ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. థియేటర్లలో 5 వ ఆట ప్రదర్శనకు వెంటనే అనుమతులను మంజూరు చేయాలని మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్మించాలని భావిస్తున్నామని, దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుతామని తలసాని పేర్కొన్నారు. ఆర్టీసి బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణం చేపట్టే అంశం పరిశీలించాలని సూచించారు. 200 నుండి 300 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణానికి అవసరమైన స్థలాను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు మరోపర్యాయం లేఖలు రాయాలంటూ శ్రీనివాస యాదవ్ సూచించారు. హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీ పక్కనే ఉన్న 9.5 ఎకరాల స్థలాన్ని కార్మికులకు గృహనిర్మాణానికి ఇవ్వవచ్చన్నారు. కార్మికులకోసం దవాఖానా నిర్మిస్తామని కూడా తెలిపారు. చిత్రపురి కాలనీలో వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు.
బాలల చలనచిత్రోత్సవానికి 8 కోట్లు
2017 నవంబర్ 8 నుండి 14 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న బాలల చలన చిత్స్రోవానికి ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తలసాని తెలిపారు. ఈ సమావేశంలో ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పి. రాంమోహన్‌రావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.