తెలంగాణ

ఇంటర్ విద్యార్థిని హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ పటాన్‌చెరు, సెప్టెంబర్ 12: హైదరాబాద్ శివారులోని మదీనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని చాందిని జైన్ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు విద్యార్థిని మృతదేహాన్ని అమీన్‌పూర్ కొండల్లో పడేశారు. విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థిని అదృశ్యం మిస్టరీ విషాదాంతం ముగిసింది. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహంపై కొన్ని చోట్ల గాయాలు ఉన్నట్టు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే విద్యార్థినిపై అత్యాచారం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. విద్యార్థిని దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు. కాగా చాందిని హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారవేత్త కిషోర్ జైన్ కుమార్తె చాందిని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుంది. కాగా ఈనెల 9న తన స్నేహితుల ఇంటికి వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్లింది. తిరిగి ఇంటికి చేరకపోగా, మదినాపూర్ కొండల్లో హత్యకు గురైంది.
కుట్రపూరితంగానే కిడ్నాప్..హత్య
తన చెల్లిని కుట్రపూరితంగానే కిడ్నాప్ చేసి హత్య చేశారని విద్యార్థిని చాందినీ జైన్ సోదరి నివేదిత జైన్ ఆరోపించారు. తమకు ఎవరితోనూ గొడవలు లేకున్నా తన చెల్లిని కావాలనే హత్య చేశారని నివేదిత ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 9న కాలేజీ నుంచి ఇంటికొచ్చిన చాందిని సాయంత్రం ఐదున్నర గంటలకు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిందని, ఓ గంట తరువాత చెల్లికి కాల్ చేస్తే ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్టు వచ్చిందని నివేదిత తెలిపింది. అనుమానం రావడంతో చాందిని కోసం బధువులు, చెల్లి స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆమె విలపిస్తూ చెప్పింది.
తన చెల్లిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, సిబ్బందితో సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని హంతకులను పట్టుకుంటామని కమిషనర్ వివరించారు.

చిత్రం..హత్యకు గురైన విద్యార్థిని చాందిని