తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: పురపాలక పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్టు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికుల సంఘాలతో మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశం అయ్యారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక హెల్త్ కార్డు తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో కార్మికులతో పని చేయించుకుంటే ఆయా కమీషనర్లదే బాధ్యత వహించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలను నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారం ఇస్తే వెంటనే ఆయా కమీషనర్లను సస్పెండ్ చేస్తామని మంత్రి కెటిఆర్ కార్మికులకు తెలిపారు. కార్మికుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు పట్టణానికి, నగరానికే పని చేయాలి కానీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కాదని కాదని తెలిపారు. కార్మికులకు అవసరం అయిన సెఫ్టీ ఎక్విప్ మెంట్ ఇచ్చామని, అవసరం అయినంత మేరకు సరఫరా చేస్తామని తెలిపారు. కానీ ఈ సామాగ్రి వాడేలా కార్మికులను చైతన్య పరచాలని కోరారు. తమకు వేతనాలు పెంచాలని, ఇయస్‌ఐ, పిఎఫ్ సౌకర్యాల కల్పన, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు, సేప్టీ ఎక్విప్‌మెంట్ వంటి పలు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకు కార్మికులు వచ్చారు. తెలంగాణలో అన్ని శ్రామిక వర్గాలకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిందని చెప్పారు. పట్టణాల్లో పరిశుభ్రత కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేవుళ్లతో సమానం అని పోల్చారని కెటిఆర్ గుర్తు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని అన్నారు. కార్మికులు ప్రస్తావించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు కెటిఆర్ చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగున్న మున్సిపాలిటీల్లో జీతాలు పెంచినా ఇబ్బంది ఉండదని, కానీ నగర పంచాయితీలు, చిన్న మున్సిపాలిటీల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. జీతాలు పెంచితే పురపాలక శాఖపై పడే అదనపు భారాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి చెప్పారు. ఇఎస్‌ఐ, పిఫ్ వంటి వాటిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు కొంత సమయం కావాలని అన్నారు. కొన్ని నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వని మున్సిపాలిటీల కమీషనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు కెటిఆర్ కార్మికులకు తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంలో ఇళ్లు లేని అర్హులైన పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్లిస్తామని మంత్రి చెప్పారు. అవసరం అయితే ప్రత్యేకంగా కోటా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.