తెలంగాణ

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ/కల్వకుర్తి, సెప్టెంబర్ 14: మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో మూడు వేర్వేరు సంఘటనలో ముగ్గురు రైతులు కరెంట్‌షాక్‌తో మృతిచెందారు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలంలోని అజీలాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన తాగునీటి బోరు నుంచి తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలంలోకి నీటిని పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై బంగారు రాజు (32) అక్కడిక్కడే మృతి చెందాడు. మృ తునికి భార్య ఎట్టమ్మ, మనీషా, దనుషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ మేరకు ఎస్సై ముత్యాల రాంమూర్తి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అదేవిధంగా చారకొండ మండలం సిర్సనగండ్ల గ్రామంలో అందుగుల వెంకటయ్య (35) అనే రైతు గురువారం కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్‌ను నిలిపివేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య మంజుల, ముగ్గు రు పిల్లలు ఉన్నారు. ఈమేరకు చారకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభు త్వ అసుపత్రికి తరలించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని సుద్దకల్ గ్రామంలో యువ రైతు బుర్రి అల్వాల్‌రెడ్డి (36) తన వ్యవసాయం పొలం వద్ద వరి చేనుకు నీరు పెట్టేందుకు గాను మోటార్ స్విచ్ అన్ చేయబోగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య పావని, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతు డు ఆదర్శ రైతుగా పనిచేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రవి పేర్కొన్నారు.