తెలంగాణ

కామన్‌వెల్త్ పతాక గ్రహీత దీక్షితకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, సెప్టెంబర్ 14: ఆస్టేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో 58 కేజీల విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎర్ర దీక్షిత బంగారు పతకాన్ని సాధించింది. క్రీడల్లో పాల్గొని గురువారం జిల్లాకు వచ్చిన దీక్షితకు వికాస్, హోలిఏంజిల్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 600 మంది విద్యార్థులు దీక్షితను రైల్వే స్టేషన్ నుండి ర్యాలీగా తీసుకొచ్చి, బ్రహ్మంగారి మండపంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు. గొప్పవారిని ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో ఎదగాలని యువతకు ఎస్పీ పిలుపునిచ్చారు. పుల్లెల గోపీచంద్, సచిన్‌టెండూల్కర్, కరణం మల్లీశ్వరి లాంటివారు కూడా అలాగే ఎదిగారన్నారు. దీక్షితకు బంగారు పతకం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి దీక్షితలాగా ఎదిగి మానుకోట ప్రాముఖ్యతను చాటాలని ఆకాంక్షించారు.

చిత్రం..దీక్షితను సన్మానిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి