తెలంగాణ

అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని పిఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ప్రాజెక్టులు కడతామంటే రైతులను రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, నైజాం కాలంలో జరిగిన భూ రికార్డుల సర్వేను ఈ ప్రభుత్వం నిర్వహించతలపెట్టి జీవోను తీసుకువస్తే దానిపై కోర్టుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. మారిన కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుంటే ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాకులాడుతోందన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రతి ఎకరానికి రూ.4 వేల రూపాయలు పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ చెల్లింపులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని, ఏ రైతు భూమి ఎక్కడ ఉంది, ఏ ఖాతాలో జమ చేయాలో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయని వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎంతమందికి భూమి ఉంటే అంతమందికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయినా, దామోదర్ రాజనర్సింహా అయినా వారికి కూడా రూ.4 వేల చొప్పున ప్రతి ఎకరానికి అందజేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. సంగారెడ్డికి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని, వచ్చిన వారిని చెరువుల మరమ్మతుకు కావల్సిన నిధులు మంజూరు చేయమంటే మొహం చాటేసి వెళ్లిపోయారని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేసారు. కులాలను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించినా మేధావులు ఆమోదించరని, అలాంటి కోవలోకి వచ్చే కంచె ఐలయ్య కోమట్లను అవమానపరిచే విధంగా వ్యవహరించడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.