తెలంగాణ

ఐరన్ లెగ్ సిఎం కెసిఆర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కెసిఆర్ ఐరన్ లెగ్ పాలన కారణంగా వర్షాలు సమృద్ధిగా పడక గత మూడేళ్లుగా శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లు ఎండిపోయాయని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ పాలనలో ప్రాజెక్టులు నిండక నల్లగొండ ప్రజలు మళ్లీ ఫ్లోరైడ్ నీళ్లే తాగాల్సివస్తోందన్నారు. కెసిఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని అందుకే రైతు సమితిల్లోనూ ఆరు అంకె వచ్చే విధంగా సభ్యుల సంఖ్యను నిర్ణయించారన్నారు. నల్లగొండలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తానంటూ కెసిఆర్ తనకు ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చడం లేదన్నారు. వేయి కోట్లతో కొత్త సెక్రటేరియట్ కడతామంటూ ప్రజాధనం దుబారా చేస్తున్న కెసిఆర్‌కు నల్లగొండ ప్రజల సంక్షేమానికి మెడికల్ కళాశాల మంజూరుకు చేతులు రావడం లేదన్నారు. అల్లుడు హరీష్‌రావు నియోజవర్గం సిద్ధిపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని, నల్లగొండ జిల్లాలో ఏళ్ల తరబడిగా మెడికల్ కళాశాల కోరుతూ స్థలం సైతం ఎంపిక జరిగినా మెడికల్ మంజూరు చేయకుండా తనపై రాజకీయ ద్వేషం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆక్టోబర్ 2వ తేదీ గాంధీ జయం తి నాటికి నల్లగొండలో మెడికల్ కళాశాల మంజూరు చేయని పక్షంలో మెడికల్ కళాశాలకు ఎంపిక చేసిన స్థలంలోనే 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానంటూ కోమటిరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో తనకు విభేదాలున్నా తాను పార్టీ మారబోనంటూ స్పష్టం చేశారు.