తెలంగాణ

మూసీకి వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, సెప్టెంబర్ 14: మూసీ ఏగువ ప్రాంతమైన హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో మూసీనదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో సంగెం గ్రామం వద్ద మూసీ నదిలో భీమలింగంకు పూజలు చేసేందుకై వెళ్లిన ఆరుగురు భక్తులు, ఇద్దరు పశువుల కాపరులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారిని మత్స్యకారులు తెప్పలతో రక్షించేదాకా వారంతా ఏడు గంటల పాటు నీటిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వివరాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సిరికొండ జహాంగీర్, లక్ష్మమ్మ, జంగులు, అలివేలు, వెంకటేశం, పూజారి చారితో కలిసి ఉదయం 10 గంటల సమయంలో మూసీ మధ్యలో గల భీమలింగం వద్దకు చేరుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు పూజలు నిర్వహించగా 12 గంటల సయమంలో ఒక్కసారిగా మూసీకి వరద పెరగడంతో అక్కడి నుండి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భీమలింగం గుడి పైన ఉన్న కప్పుపైకి ఎక్కి కూర్చున్నారు. నదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో రెడ్లరేపాక గ్రామానికి చెందిన తమ వారికి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించగా వారు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు, ఎన్‌డిఆర్‌ఏ బృందం అప్రమత్తమై సంగెం గ్రామానికి పరుగులు తీశారు. అక్కడ చేరుకున్న అధికారులు వరదలో చిక్కుకున్న వారితో ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. మరోవైపు నీటిలో చిక్కుకున్న సంగెం గ్రామానికి చెందిన ఇద్దరు పశువుల కాపరులు చిలుకల యాదయ్య, స్వామి సైతం నదీ జలాల మధ్యలో గల బండరాళ్లపైకి ఎక్కి కూర్చున్నారు. దీంతో స్థానిక మత్స్యకారులు తెప్పల సహాయంతో నదిలోకి వెళ్లి వారిని రక్షించి బయటకు తీసుకరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ అనితారామచంద్రన్, జెసి రవి నాయక్, ఆర్డీవో సూరజ్‌కుమార్, డిసిపి యాదగిరి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏలిమినేటి కృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అధికారులతో కలిసి సహాయ చర్యలను పర్యవేక్షించారు. సహాయ కార్యక్రమాల్లో రామన్నపేట సిఐ శ్రీనివాస్, తహాశీల్దార్ భీంపాక యాదయ్య, ఎంపిడివో విజయానాయక్, వలిగొండ ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు, ఎంపిపి శ్రీరాముల నాగరాజు, జడ్పీటిసి మొగుళ్ల శ్రీనివాస్, నాగెళ్లి నర్సింహ్మాస్వామి, గర్ధాసు బాలయ్యలు పాల్గొన్నారు.

చిత్రం..సంగెం వద్ద మూసీ నది వరద ఉధృతిలో చిక్కుకున్న భక్తులు