తెలంగాణ

మహిళా, శిశు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపధ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి మహిళా శిశు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను సత్వరమే విడుదల చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రిని శుక్రవారం హరిత ప్లాజాలో మంత్రి తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే సఖీ కేంద్రాల మంజూరుకు ఆమోదం తెలిపామన్న కేంద్రమంత్రి, మిగిలిన అంశాలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సఖీ కేంద్రాలను మంజూరు చేసినందుకు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి తుమ్మల సమీకృత శిశు సంక్షేమాభివృద్ధి పథకాన్ని మిషన్ మోడ్‌లో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా కోరారు. కొత్త రాష్ట్రంలో మహిళా, శిశు సంక్షమానికి ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి తుమ్మల కేంద్ర మంత్రికి వివరించారు. ప్రత్యేకించి అంగన్‌వాడీలకు జీతాలు పెంచిన విషయాన్ని తెలియజేశారు. అలాగే కెసిఆర్ కిట్, ఒంటరి మహిళల పెన్షన్, కల్యాణ లక్ష్మి పథకాలతో పాటు ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెసిడెన్సియల్ స్కూళ్లు, కాలేజీల గురించి కేంద్రమంత్రికి వివరించారు. కొత్త జిల్లాలో సఖీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వెంటనే స్థలాల అప్పగింతకు ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మేనకా గాంధీ సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్రం చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రికి తుమ్మల వివరించారు. ఈ సందర్భంగా మేనకా గాంధీకి పోచంపల్లి చీరను బహూకరించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మంత్రి తుమ్మలతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ డైరక్టర్ విజయేంద్ర బోయి, దివ్యాంగుల శాఖ డైరక్టర్ శైలజ, కారా చైర్మన్, ఎస్సీ పిసిఆర్ సభ్యులు పాల్గొన్నారు.