తెలంగాణ

అటవీ భూమి రక్షణే ప్రథమ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ఒక వినూత్న ప్రయోగమని, అటవీ భూములను రక్షించుకునేందుకు, రెవెన్యూ రికార్డుల్లో వాటిని నమోదు చేసుకునేందుకు ఇదో మంచి అవకాశమని ప్రధాన అటవీ సంరక్షణాధికారి పికె ఝూ అన్నారు. శుక్రవారం నాడు ఆయన సచివాలయం నుంచి జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.అటవీ భూమి రక్షణ, సరైన రికార్డులు పొందటమే లక్ష్యంగా ప్రతి ఉద్యోగి, అధికారి మూడు నెలల్లో లక్ష్య సాధన దిశగా పని చేయాలని అన్నారు. అటవీ శాఖ ఆస్తులు, అతిథి గృహాలు, సిబ్బంది క్వార్టర్లు ఉండే భూముల సహా నోటిఫైడ్ ప్రత్యామ్నాయ అటవీ భూముల వివరాలు కూడా తప్పనిసరిగా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కేలా చూడాలన్నారు. మూడో విడత హరితహారం కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు 40 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా, 30 కోట్లు మాత్రమే నాటారని, మిగిలిన 10 కోట్ల మొక్కలను రక్షణాత్మక చర్యలతో నాటాలని ఆదేశించారు.