తెలంగాణ

బ్లూవేల్ అదుపునకు నిశింత్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: పాఠశాల విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్ శుక్రవారం నాడు చెప్పారు. రాష్ట్రంలో బ్లూవేల్‌ని కంట్రోల్ చేయడానికి నిశింత్ యాప్‌ను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. మొబైల్, కంప్యూటర్స్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పేరెంట్స్ యాప్ ద్వారా అన్ని గేమ్స్ యాప్‌లను కంట్రోల్ చేసుకునే వీలుందని అన్నారు. దీనిపైన రైట్స్ కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ఇచ్చారన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న పిల్లల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వర్కుషాప్‌ను నిర్వహించినట్టు పేర్కొన్నారు. విద్యార్థి సమస్యలపై విద్యాశాఖ శుక్రవారం నాడు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి పెద్ద అజెండానే పెట్టుకున్నా అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరగలేదు. డ్రగ్స్ నిరోధం, సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటున్న ఘటనలు, పాఠశాలల్లో భద్రత, టీచర్లకు శిక్షణ, విద్యార్థుల శిక్షలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. దీంతో పాటు విద్యార్ధుల డాటాను ఆధార్‌తో అనుసంథానం చేయడం, రానున్న రోజుల్లో టెట్ క్వాలిఫై అయిన వారిని మాత్రమే టీచర్లుగా నియమించాలనే నిబంధనలను పాటించడం, వచ్చే ఏడాది నుండి ఒకటినుంచి పదో తరగతి వరకూ తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించడం, అన్ని విద్యాసంస్థల జమా ఖర్చుల వివరాలను జిల్లా విద్యా శాఖాధికారులకు సమర్పించడం, మీజిల్స్, రూబెల్లా టీకాలను విద్యార్ధులు అందరికీ వేసేలా చూడటంపై కూడా చర్చించారు.