తెలంగాణ

దురాశ..బందీలను చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, సెప్టెంబర్ 15: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశ తండ్రి, కొడుకులను దొంగనోట్ల ముఠా వద్ద బందీలను చేసింది. డబ్బులు అప్పుగా తీసుకున్న పరిచయస్థుడు బాధితుల కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసింది. దొంగ నోట్ల మార్పిడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న దురాశ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బందీలుగా మార్చింది. పది రోజులుగా కిడ్నాప్‌కు గురయ్యారన్న తండ్రి, కొడుకుల కథ ఎట్టకేలకు పోలీసుల సమయస్ఫూర్తితో ఛేదించారు. మెదక్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మావురము ప్రభాకర్ జీవిత భీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రభాకర్‌కు అదే మండలం బచ్చురాజ్‌పల్లికి చెందిన లంబాడి శంకర్ ద్వారా దొంగనోట్ల పాత నేరస్థుడు ఖానాపూర్‌కు చెందిన లింగారెడ్డి పరిచయడం అయ్యాడు. ప్రభాకర్ వద్ద లింగారెడ్డి లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. పశ్చిమబెంగాల్‌లోని కాలియచాక్‌కు చెందిన మెహతాబ్‌ను అక్కడికి వెళ్లి కలిసి లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షల రూపాయల నకిలీ నోట్లను తీసుకున్నాడు. ఆ నోట్లను పరిశీలించగా సక్రమంగా లేకపోవడంతో లింగారెడ్డి తిరిగి మెహతాబ్‌కు ఇచ్చేశాడు. అవి బాగాలేనందున నీవు తిరిగి మళ్లీ వస్తే మంచి నోట్లను తెప్పించి ఉంచుతానని చెప్పి పంపించేశాడు. ప్రభాకర్ తాను ఇచ్చిన లక్ష రూపాయల విషయమై లింగారెడ్డిని అడిగాడు. దొంగనోట్లను విషయం ప్రభాకర్‌కు చెప్పి మెహతాబ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. లింగారెడ్డి లక్ష రూపాయలు ఇచ్చాడని, ఇరువురిలో ఎవరు వచ్చినా రెండు లక్షల రూపాయలు ఇస్తానని ప్రభాకర్‌కు నమ్మబలికాడు. వారి మాటలు నమ్మిన ప్రభాకర్ తన కొడుకు సతీష్‌ను వెంట బెట్టకొని లక్ష రూపాయలు తీసుకొని ఈ నెల 6న సికిందరాబాద్ నుండి పశ్చిమబెంగాల్‌కు బయలుదేరాడు. 8న న్యూపరక్క రైల్వే స్టేషన్‌లో దిగిన వారిని మెహతాబ్ అక్కడి నుండి కాలియాచాక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పగ్లతోలో గల తన ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. కొద్దిసేపటికి మెహతాబ్ తమ్ముడు అజిజున్, బుదియార్ అనే ముగ్గురు కలిసి గదిలోకి వెళ్లి కత్తులుచూపి తండ్రి, కొడుకులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులతోపాటు సెల్‌ఫోన్‌లు లాక్కున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారిని అక్కడే బందించారు. రాత్రి 11.57 గంటల సమయంలో ప్రభాకర్ చిన్నకొడుకు రాజుకు ఫోన్ చేయించి 40 లక్షలు తీసుకొని కలకత్తా రైల్వేస్టేషన్‌కు తీసుకురావాలని బెదిరించారు. 24 గంటల్లో డబ్బులు తీసుకురాకపోతే చంపేస్తామని బెదిరిస్తున్న విషయాన్ని ప్రభాకర్ ద్వారా చెప్పించారు. ఈ నెల 12వ తేదీ వరకు ప్రభాకర్ ఫోన్‌తో చిన్నకుమారుడు రాజు, తమ్ముడు రాంచంద్రంలతో బెదిరిస్తూ త వచ్చారు. నిజాంపేటలో కేసు నమోదుచేసిన పోలీసులు ఎస్‌పి ఆదేశాల మేరకు రామాయంపేట సిఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐలు నాగార్జునగౌడ్, ఆంజనేయులు పశ్చిమబెంగాల్‌లోని మాల్దాకు 9న చేరుకున్నారు. అక్కడ విచారణ కొనసాగుతున్న క్రమంలో ఫోన్ ద్వారా వచ్చిన బెదిరింపుల ఆధారంగా సెల్‌ఫోన్ లొకేషన్ గుర్తించి పర్లతోలా గ్రామంలోని మహెతాబ్ ఇంటిపై అక్కడి పోలీసులతో కలిసి ఇక్కడి సంయుక్తంగా దాడిచేశారు. అక్కడే ఉన్న నేరస్థులు బదియూర్, అజీజుల్‌లను పట్టుకున్నారు. మహెతాబ్ పరారీలో ఉన్నాడు. బందీలుగా ఉన్న ప్రభాకర్, సతీష్‌లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని సురక్షితంగా అక్కడి మాల్దా కోర్టులో హాజరుపరిచారు.