తెలంగాణ

మిషన్ భగీరథలో మంచినీటి గ్రిడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: గోదావరి, కృష్ణా బేసిన్‌ను అనుసంధానిస్తూ మిషన్ భగీరథలో మంచినీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ ఎర్రమంజిల్‌లోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో మిషన్ భగీరథ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను కెటిఆర్ ఆవిష్కరించారు. అలాగే రూ.కోటి ప్రపంచ బ్యాంక్ నిధులతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికి రక్షిత మంచి నీరు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, చివరి గడపకు నీరు అందే వరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు విశ్రమించవద్దని అన్నారు. తాగునీటి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి చేయడానికి మిషన్ భగీరథకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారని అన్నారు. మిషన్ భగీరథ దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని, ఇప్పటికే 9 రాష్ట్రాలు ఈ పథకం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించాయని వివరించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.