తెలంగాణ

స్కూళ్లలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: స్కూళ్లలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా పాఠశాలల వార్షిక షెడ్యూలులో మార్పులు చేసింది. దానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుండి జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కొత్త కేలండర్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా సిలబస్‌ను పూర్తి చేసి, రివిజన్ ప్రారంభించాలి, ఫిబ్రవరి 29లోగా ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలి, ఒకటో తరగతి నుండి 9వ తరగతి వకరూ సిలబస్ మొత్తాన్ని ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దసరా సెలవులు అక్టోబర్ 20 నుండి నవంబర్ 4వ తేదీ వరకూ ప్రకటించారు. క్రిస్మస్ సెలవులు కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 24 నుండి 28వ తేదీ వరకూ ఇస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 12 నుండి 16వ తేదీ వరకూ ఇస్తారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు సెప్టెంబర్ 19 నుండి జరుగుతాయి.