తెలంగాణ

యుద్ధప్రాతిపదికన పాలమూరును పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. శనివారం ఇక్కడ జలసౌధలో ఆయన పాలమూరు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంకగా 4500 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉండడం పట్ల భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. నత్తనడకన పనిచేస్తున్న ఏజెన్సీలను గుర్తించి ఆయా ఏజన్సీలను రద్దు చేసి వేరే ఏజన్సీలకు పనులు అప్పగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్ధితుల్లో వచ్చే ఖరీఫ్‌లో 4 లక్షల ఎకరాలకు కల్వకుర్తి నుంచి సాగునీరు అందించాలన్నారు.