తెలంగాణ

అంబర్‌పేట్ కూడలి వద్ద ఫ్లై-వోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎప్పుడూ రద్దీగా ఉండే ఉప్పల్ మార్గం (ఎన్‌హెచ్-202)లో జాతీయ రహదారి అంబర్‌పేట్ కూడలి వద్ద ఫ్లై-వోవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉప్పల్‌కు వెళ్ళే దారిలో 1.415 కి.మీ నిడివి గల నాలుగు వరుసల ఈ ఫ్లై-వోవర్ నిర్మాణానికి రూ.338 కోట్ల అంచనా విలువ గల ఈ ప్రతిపాదనకు పరిపాలనాపరమైన అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, తానూ కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ అనుమతి సాధించినట్లు మంత్రి తుమ్మల శనివారం మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని ఇతర రహదారులతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో రహదారుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది వాస్తవమేనని, అయితే ఈ పరిస్థితి చక్క దిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అంబర్‌పేట్ కూడలి వద్ద ప్లై-వోవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. వర్షాకాలంలో ఏర్పడే గుంతలు, వాహనదారులకు కలిగే అసౌకర్యాలు, విపరీతమైన ట్రాఫిక్ సమస్య, ఇరుకు రోడ్లు, ప్రమాదకరమైన కూడళ్ళు, మెట్రో నిర్మాణం, మురుగు, మంచి నీటి పైపులు, కేబుళ్ళు, కేబుల్-డక్ట్ వంటి వ్యవస్థలు మొదలైన వాటిపై అధ్యయనం చేసి కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపామని ఆయన వివరించారు.అంబర్‌పేట్‌లో ప్లై-వోవర్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రూ.229 కోట్లు, ప్లై-వోవర్ నిర్మాణానికి రూ.111.71 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. గోల్నాక కూడలి నుంచి సేలం బైబిల్ చర్చి దగ్గర ప్రారంభమయ్యే ఈ ఫ్లై-వోవర్ అంబర్‌పేట్ మార్కెట్ వద్ద గల ముఖరం హోటల్ దగ్గర ముగుస్తుందన్నారు. ఈ ఫ్లై-వోవర్ నిర్మాణానికి 4.62 ఎకరాల భూ సేకరణ అవసరం అవుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.
రహదారుల ప్రణాళికలు
నగరంలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఎస్‌ఆర్‌డిపి ఫేస్-1 కింద రూ.2631 కోట్లతో ప్లై-వోవర్ల నిర్మాణం, కూడళ్ళ అభివృద్ధి, పేస్-2లో రూ.6487 కోట్లతో పథకాలు, ఫేస్-3లో రూ.3625 కోట్లతో పథకాలు, ఫేస్-4లో రూ.5100 కోట్లతో పథకాలు, నగరంలోని జాతీయ రహదారులపై అరంగడ్, ఉప్పల్, ఎల్‌బి నగర్ కూడళ్ళ వద్ద మూడు ఎలివేటెడ్ కారిడార్లు (ఎతె్తైన రహదారులు) రూ.1400 కోట్లతో అంచనాలు, రాష్ట్ర పరిథిలో నగరం నుంచి వెలుపలికి వెళ్ళే రేడియల్ రోడ్ల అభివృద్ధికి రూ.560 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 45 లక్షల వాహనాలు ఉన్నాయని, వాటి పెరుగుదల ప్రతి ఏటా 16 శాతం ఉంటున్నదని అన్నారు. పట్టణ జనాభా పెరుగుదల ప్రతి ఏటా 5 శాతం వరకు ఉందన్నారు. ప్రతి రోజూ సుమారు 800 కొత్త వాహనాలు నగర రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు.