తెలంగాణ

ఫీజుల బకాయిల కోసం కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఫీజుల బకాయిలు చెల్లించాలని, పూర్తి ఫీజుల పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్వర్యంలో శనివారం అనేక కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ఉద్ధేశించి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ గత సంవత్సరం పెండింగ్‌లో ఉన్న 1600 కోట్ల రూపాయలను ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలైనా ఇంకా గత ఏడాది ఫీజుల బకాయిలు రూ.1600 కోట్లు పెండింగ్‌లో ఉంచిందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు చెల్లించడం లేదన్నారు. పేద కులాల వారికి ఇంజనీరింగ్, వైద్యం, పిజి, డిగ్రీ, ఇంటర్ వంటి ఉన్నత విద్య, వృత్తి విద్య కోర్సులు చదవాలన్న ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినా అది నెరవేరడం లేదన్నారు. కళాశాల స్థాయి కోర్సులు చదివే బిసి విద్యార్థులకు జిల్లా కేంద్రాల్లో బిసి కళాశాల వసతి గృహాల్లో సీట్లు లభించక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిసిలకు 500 బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, గుజ్జ రమేష్, భూపేష్ సాగర్, రావులకోలు నరేష్, అనంతయ్య పాల్గొన్నారు.