తెలంగాణ

మాదాపూర్ స్పా సెంటర్లలో మసాజ్ ముసుగులో వ్యభిచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, సెప్టెంబర్ 16: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లోని స్పా సెంటర్లలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఆదిత్యను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో అరెస్టయిన ఆదిత్యకు హైదరాబాద్‌లో 6, బెంగుళూరులో ఒక మసాజ్ స్పా సెంటర్ ఉంది. అయితే వీటిల్లో థాయిలాండ్, ఈశాన్య దేశాలకు చెందిన యువతులను రప్పించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. దీంతో నిఘా వేసిన మాదాపూర్ పోలీసులు ఎట్టకేలకు ఆదిత్యను అరెస్టు చేశారు. కాగా..గత నెల 19న మాదాపూర్‌లో ప్రత్యేక పోలీసులు జరిపిన సోదాల్లో మరో నిర్వాహకుడు సిద్దార్థను అరెస్టు చేశారు. సిద్దార్థ, ఆదిత్యకు అత్యంత స్నేహితుడు. పరారీలో ఉన్న ఆదిత్యను ఎట్టకేలకు చెన్నైలో అరెసినట్టు పోలీస్ అధికారి విశ్వప్రసాద్ తెలిపారు. ఇదిలావుండగా అకౌంటెంట్ నరసింహరాజును ఈనెల 8న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా ప్రధాన నిందితుడు ఆదిత్యను విచారిస్తే ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.