తెలంగాణ

శాటిలైట్‌తో హద్దుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: అటవీ హద్దుల గుర్తింపు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాటిలైట్ మ్యాపులు ఉపయోగించుకోవాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ అన్నారు. అటవీ భూముల రక్షణకు, న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి పక్కా హద్దుల ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
శనివారం అరణ్య భవన్‌లో ఫారెస్ట్ బ్లాక్‌ల డిజిటలైజేషన్‌పై డైరెక్టర్ జనరల్ సిద్ధాంత దాస్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధాంత దాస్ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, విభిన్న రకాల అభివృద్ధి పనుల వలన పర్యావరణ సమతుల్యత ప్రమాదంలో పడిందని అడవులను కాపాడుకోవడం ఒక్కటే దీనికి మార్గమని అన్నారు. దేశ విస్తీర్ణంలో మూడో వంతుకు పైగా ఉండాల్సిన అటవీ ప్రాంతం కేవలం 24 శాతంగా ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న అటవీ సంపదను కాపాడుకుంటూనే పచ్చదనాన్ని మరో 9 శాతం పెంచుకునేందుకు అన్ని రాష్ట్రాలూ కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా హరితహారంతో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తాయన్న ఆశాభావాన్ని సిద్ధాంత దాస్ వ్యక్తం చేశారు.
ఇంకా ఈ సమావేశంలో ఎపి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎపి పిసిసి ఎఫ్ పికె సారంగి, తెలంగాణ పిసిసిఎఫ్ పికె ఝూ, కర్నాటక చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిస్వజిత్ మిశ్రా, ఒరిస్సా ప్లానింగ్ అనాలసిస్ రీసెర్చ్ అధికారి ఎస్. మిశ్రా అదనపు అటవీ సంరక్షణాధికారులు పాల్గొన్నారు.