తెలంగాణ

ప్రభుత్వ కృషి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: భూమిపై పచ్చదనం పెంచేందుకు, నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఆదర్శనీయమని కేంద్ర అటవీ శాఖ ప్రధానాధికారి సిద్ధాంత దాస్ ప్రశంసించారు. శనివార ఇక్కడ ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక అడవుల పెంపకానికి చర్యలు చేపట్టినట్లు కెసిఆర్ వివరించారు. బావి తరాలకు పచ్చదనం పెంచడంపై అవగాహన కల్పించేందుకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంవాల్లో హరితహారం కార్యక్రమాన్ని ఓ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఓఆర్‌ఆర్ సమీపంలో అర్బన్ పార్కులు
నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు సమీపంలో అటవీ శాఖ నేతృత్వంలో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సిఎం ఒఎస్‌డి (హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఒఆర్‌ఆర్ వెంట పచ్చదనం పెంపుపై అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన శనివారం నిర్వహించారు. ఔటర్ వెంబడి హరిహారం ద్వారా పచ్చదనం నిర్వహణపై సిఎం కెసిఆర్ పట్టుదలగా ఉన్నారని తెలిపారు. వీలు ఉన్న ప్రతి చోట మూడు వరుసల్లో మొక్కలు నాటాలని, కనీసం రెండు మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలు నాటడడంతో పాటు నాటే సమయంలో ట్రీ గార్డులతో పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. స్వయంగా మొక్కలునాటిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి పలు సూచనలు చేశారు.