తెలంగాణ

కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం బషీర్‌బాగ్‌లో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, హోంగార్డుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితోపాటు పలువురు బిజెపి నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, బషీర్‌బాగ్‌లో హోంగార్డుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సదస్సు జరుగనుండగా, హోంగార్డులు సదస్సుకు హాజరుకానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కొందరు హోంగార్డులతోపాటు వారి కుటుంబ సభ్యులు సదస్సుకు హైదరాబాద్‌కు తరలివచ్చారన్నారు. హోంగార్డులకు నెలసరి వేతనం రూ. 3000లు ఉన్న కాలం నుంచి, వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ, అనేక ఆందోళనలు చేపట్టిన తాను, ఈనెల 16న నిర్వహించతలపెట్టిన సదస్సుకు హోంగార్డులను అడ్డుకునేందుకు యత్నించిన టిఆర్‌ఎస్ పాలకులపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హోంగార్డుల కోసం పోరాడి రూ. 3వేల వేతనం నుంచి రూ. 9వేల వరకు సాధించుకున్నామని, ప్రస్తుతం వీరి జీత,్భత్యం వారి కుటుంబ పోషణార్థం ఏ మాత్రం సరిపోదన్నారు. ప్రభుత్వం వెంటనే హోంగార్డుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సివిల్ పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పట్ల వివక్ష తగదన్నారు. హోంగార్డుల సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. హోంగార్డుల సమస్యలపై నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఆయన ఒక వినతి పత్రం అందజేశారు.